యుద్ధానికి ముందే చేతులెత్తేసిన చంద్రబాబు

హైదరాబాద్:

యుద్ధానికి ముందే చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారని వైయస్ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు ఓవీ రమణ ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఇంకా తనకేదో సామర్థ్యం ఉందని ఊదరగొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆదివారంనాడు రమణ మీడియాతో మాట్లాడుడారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని 2009 ఎన్నికల్లో ఎదు‌ర్కొనడానికి నాలుగైదు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి కూడా చంద్రబాబు ఓటమిపాలయ్యారని, ఇప్పుడు మళ్ళీ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో తలపడటానికి మాయా కూటమిగా వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మూడు కాళ్ల ముసలివాడైపోయిన చంద్రబాబు రెండు మూడు పార్టీలు వచ్చి మద్దతిస్తే తప్ప నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని రమణ వ్యాఖ్యానించారు. మాయాకూటమిలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ, సీపీఐ నారాయణ అందరూ సభ్యులేనని, వీరు చాలక ఇంకా ఎవరైనా వస్తే వారినీ కలుపుకుందామని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో మద్ద‌తు కోసం ఎదురు చూసే కంటే చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవడం మేలని రమణ హితవు పలికారు. ఎన్ని పార్టీలతో కలిసి మాయాకూటమిగా వచ్చినా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో మహా ఓటమి తథ్యం అన్నారు.

తాజా వీడియోలు

Back to Top