ఓర్వలేకనే జగన్‌పై వేధింపులు: జగపతి

మెదక్‌: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ, కాం గ్రెస్ పార్టీలు సీబీఐని పావుగా వాడుకొని ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ మండలం బూర్గుపల్లి కి పలువురు గ్రామస్థులు జగపతి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగపతి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పలువురు చిన్నారులు డెంగీ, తదితర రోగాల బారి న పడి ప్రాణాలు కోల్పోతున్నారని, అయినప్పటికీ ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేర న్నారు. టీడీపీ శ్రేణులు మద్యాన్ని పారి స్తూ చంద్రబాబు పాదయాత్రకు జనాల ను తీసుకొస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత విద్యనందిస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ మం డల కన్వీనర్ మాణిక్యం, నాయకులు క రీం, టిల్లు,యోహన్, శ్యాంసన్, సైమన్, సుధీర్, రవి, ప్రసాద్, సురేశ్, రాజయ్య, లక్ష్మణ్, నరేష్, బాబు, విజయ్‌కుమార్, శేషు, రాము, విశాల్, శివ, శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.

Back to Top