ఊరంతా వైయస్‌ఆర్ పథకాల లబ్ధిదారులే!

గాదెవారిపల్లె (గుంటూరు జిల్లా) : ఆ ఊరి పేరు గాదెవారిపల్లె. ఊళ్ళో మొత్తం 800 గడపలు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వచ్చి ఊరి మధ్య రచ్చబండ మీద కూర్చున్నారు. మహిళలు చెప్తున్న సమస్యలు వింటున్నారు....

ఇంతలో... వెంకటేశ్వర్లు అనే రైతు ముందుకు వచ్చాడు. ‘అమ్మా నేను మాట్లాడతా’ అంటూ మైకందుకున్నాడు.
'మా ఊరు ఊరంతా వచ్చి ఇక్కడే ఉంది..'
'గ్రామస్తులకు దండం పెడుతున్నా..'
'మన ఊరిలో హిందులువులున్నారు.. ముస్లింలు.. క్రిస్టియన్లూ ఉన్నారు. టిడిపి, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలూ ఉన్నాయి.
ఇంత మందిలో ఏ ఒక్కరైనా మహానేత వైయస్‌ఆర్ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి‌ పొందని వాళ్లు ఉంటే చేతులు లేపండి’ అని కోరాడు.
శ్రీమతి షర్మిలతో పాటు అక్కడున్న నాయకులు దాదాపు ఐదు నిమిషాల పాటు వేచి చూశారు.
ఒక్క చెయ్యంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు.
‘అదమ్మా మహానాయకుడు వైయస్‌ఆర్ మాకు చేసిన సాయం‌ ... వైయస్‌ఆర్ మా గుండె‌ల్లోనే ఉన్నాడమ్మా’ అని అన్నాడు.
మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ దయ వల్ల ఒక్క గాదెవారిపల్లెలోనే మొత్తం రూ.1.70 కోట్ల రుణ మాఫీ అయిందని వెంకటేశ్వర్లు వివరించాడు.
Back to Top