బాబుపై ఆన్‌లైన్‌ ఉద్యమం

–ఓటుకు కోట్లు కేసుపై ఆన్‌లైన్‌లో పిటీషన్లు
–ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ ద్వారా సంతకాల సేకరణ
–మద్దతు పలుకుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌: దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో న్యాయపోరాటం ఉధృతరూపం దాల్చింది. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడైన చంద్రబాబును విచారించాలని ఐటీ ఉద్యోగులు ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వేలాది మందితో ఆన్‌లైన్‌ పిటీషన్‌కు సంతకాలు సేకరిస్తున్నారు. ఐటీ ఉద్యోగి తిరుమల ప్రసాద్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో కేవలం మూడు రోజుల్లోనే 12 వేల మంది సంతకాలు సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ పిటీషన్‌ ప్లాంట్‌ఫాం అయిన ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ 196 దేశాల్లో సంతకాల సేకరణ ప్రారంభించారు. 

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్‌ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఇటీవల చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడగా, ఫోన్‌లో ఢీల్‌ కుదిరిస్తున్న చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు రెండు చార్జీషిట్‌లు నమోదు చేయగా అందులో చంద్రబాబు పేరు 48 సార్లు ప్రస్తావనకు వచ్చింది. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే చంద్రబాబుకు జైలు శిక్ష ఖాయం. 
మీరు ఓటు వేయడానికి ఈ లింక్ క్లిక్ చేయగలరు. goo.gl/5P0V4b
Back to Top