కేంద్రంపై మ‌రోసారి నోటీసు

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  మ‌రోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు అంద‌జేసింది. శుక్ర‌వారం లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు అంద‌జేశారు.ఈ నెల 15న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తనకు అందాయని చెప్పారు. ఈ మేరకు నోటీసులను ఆమె చదివి వినిపించారు కూడా. అయితే స‌భ ఆర్డ‌ర్‌లో లేద‌ని లోక్‌స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అంద‌జేశారు.
Back to Top