బాబు అవినీతి, అక్రమాలను అడ్డుకుంటాం

  • చంద్రబాబుది అసమర్థ పాలన
  • ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు సిగ్గుచేటు
  • బాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై నిందలు
  • తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారు
  • బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన 
హైదరాబాద్ః పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడం  రాజ్యాంగానికి విరుద్ధమని పదవ షెడ్యూల్ చెబుతున్నా కూడ చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.  ముఖ్యమంత్రి రికమెండేషన్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం దారుణమన్నారు. చంద్రబాబు అవినీతి, అనైతిక పనులను అడ్డుకుంటామని బుగ్గన పేర్కొన్నారు.   పట్టపగలే వైయస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడమే గాకుండా ఏకంగా వాళ్లలో నలుగురికి మంత్రి పదవి ఇచ్చి  చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ పాలనపై  ప్రజలు తీవ్ర అసంతృప్తి,  అసహనంతో ఉన్నారని తెలిసి... బాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ఏపీ ప్రజలు ఇచ్చిన బాధ్యతను వైయస్సార్సీపీ సమర్థవంతంగా నిర్వరిస్తుందని చెప్పారు. 

ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయించడం తప్పుకాదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా బాబు అవినీతి, అసమర్థ పాలనను అడ్డగిస్తే...అది అభివృద్ధికి అడ్డంపడుతున్నట్లు ఎలా అవుతుందని బాబును కడిగిపారేశారు. రాష్ట్రంలో ఏది జరిగినా అది వైయస్ జగన్ మీదికి నెట్టడం బాబుకు బాగ అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. పదవిలో ఉన్నాం కదా అని ఏది వస్తే అది ఊరికే అందరి మీద బురదజల్లడం సరికాదని బాబుకు హితవు పలికారు. వైయస్ఆర్ పాలనలో ఫిరాయింపులు జరగలేదా అని టీడీపీ నేతలు మాట్లాడడంపై కౌంటర్ ఇచ్చారు. ఏనాడు  కూడ వైయస్ఆర్ చంద్రబాబు లాగ ఎవరికి పార్టీ కండువాలు కప్పలేదని, మంత్రులను చేయలేదని చురక అంటించారు. నా అంత అనుభవం లేదు. నిప్పులాంటోడిని పదే పదే మాట్లాడే నీవు..ఇలా చేయడం  నీ అనుభవానికి తగునా? అని బుగ్గన నిలదీశారు. చంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉన్నా ఇతర పార్టీ నుంచి గెలిచిన 21మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవసరం ఏమొచ్చిందని దుయ్యబట్టారు. ఎక్కడైనా సంకీర్ణం ద్వారా మెజారిటీ ప్రభుత్వం ఏర్పడుతుందని...కానీ ఏపీలో మాత్రం  మెజార్టీ ప్రభుత్వాన్ని బాబు సంకీర్ణ ప్రభుత్వంగా మార్చారని తూర్పారబట్టారు. ఇద్దరు బీజేపీ మంత్రులు, నలుగురు వైయస్సార్సీపీ మంక్రులు. చూస్తే ఆశ్చర్యపోతారు. ఈవిధంగా కూడ రాజకీయాలుంటాయా అని. 

2016-17లో దేశ జీడీపీ  7.01 శాతం సాధిస్తే...ఏపీ స్థూల ఉత్పత్తి11.56 శాతం సాధించిందని బాబు  గర్వంగా గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఉత్పిత్తి పెరుగుల 3 శాతం ఉందని, చైనా 6శాతం ఉంటే భారతదేశం చైనా కంటే ఎక్కువగా సాధించారా అని ఎకనామిస్ట్ లు చెబుతుంటే..బాబు ఏకంగా 11.56 శాతమని చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలోనే ఫస్ట్ అని బాబు చెప్పుకుంటున్నప్పుడు ఆయనకు ఎవరు అడ్డొచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే లెక్కలన్నీ తప్పులతడకలేనని బుగ్గన దుయ్యబట్టారు. టీడీపీని చంద్రబాబు టెంపరరీ డెవలప్ మెంట్ పార్టీగా మార్చారని విమర్శించారు. గత మూడేళ్లలో మీరు సాధించేదిమిటి బాబు..? రాజధాని, వెలగపూడిలో ఆరు బిల్డింగ్ లు టెంపరరీ, అసెంబ్లీ టెంపరరీ, పట్టిసీమ టెంపరరీ, పురుషోత్తపట్నం టెంపరరీ.  రాష్ట్రంలో నీ టెంపరరీని మేమేమైనా ఆపామా బాబు అని విమర్శలు సంధించారు. పట్టిసీమ పేరుతో పసుపు నీళ్లు, చెండుపూలు, చామంతి పూలు వేసుకొని నీటిలో మునిగి తేలి ఈత కొట్టి  రకరకాలుగా యాగి చేశారని ఆరోపించారు.  టీడీపీవాళ్లు ఏం మాట్లాడినా కూడ రాష్ట్రం, దేశం గురించి మాట్లాడరని...వాళ్లదంతా ప్రపంచస్థాయేనని ఎధ్దేవా చేశారు. రెండుసార్లు నదుల అనుసంధానం చేశామని చెప్పారు. రూ.1170కోట్లు ఎస్టిమేట్ కాస్టే అనవసరమంటే రూ.1670కోట్లకు పెంచారు. మిగతా 500కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయో ప్రజలంతూ చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరును కాగ్ కూడ తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 

లక్షల ట్యాంకర్లు పెట్టినా కరువును జయించలేమని, అలాంటిది ఐదురోజుల్లో రెయిన్ గన్ లు తీసుకొచ్చి కరువును పారదోలామని చంద్రబాబు చెప్పడంపై బుగ్గన మండిపడ్డారు. వరుణ దేవుడు కూడ ఇంత ధైర్యం చేయడేమోనని చురక అంటించారు. ప్రతీ కార్యక్రమాన్ని చంద్రబాబు బ్యూటిఫుల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ లాగ చేస్తుంటే మేమేమైనా అవి ఆపగలిగామా...? విశాఖ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో రూ. 10లక్షల50 వేల కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు.  ఇది ఫిగరా ఇంకేమంన్నా...? 665 యూనిట్లు,  22లక్షల మంది ఉద్యోగాలొచ్చాయని చెప్పుకుంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారు బాబు మీరు.  ఇంతకుముందు 5లక్షల కోట్లు అని చెప్పుకుంటున్నారు. వేయి, పదివేలు కాదు మాట్లాడితే లక్ష కోట్లు అనడం బాబుకు బాగ అలవాటైపోయిందని బుగ్గన ఫైర్ అయ్యారు. పెట్టుబడుల గురించి అసెంబ్లీలో తాము ప్రభుత్వాన్ని కూడ నిలదీశామని గుర్తు చేశారు.

 
చంద్రబాబు ప్రభుత్వం వచ్చేనాటికి  రాష్ట్ర అప్పు 97వేల కోట్లు ఉందని, ఆయనొచ్చాక 2017-18 బడ్టెజ్ అంచనాలు చూస్తే 2లక్షల 16వేల కోట్లుగా ఉందని చెప్పారు. మూడేళ్లలో లక్ష 20వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.  60 ఏళ్ల ఆంధ్ర ప్రదేశ్ అప్పు 97కోట్లు అయితే బాబు వచ్చిన రెండేళ్లలోనే లక్ష 20వేల కోట్లకు అప్పు పెంచారని పేర్కొన్నారు.  అంత అప్పు చేయొద్దని చెబితే ఎనాడైనా విన్నారా బాబు..? అని నిప్పులు చెరిగారు. మాట్లాడితే అవినీతిని ఓర్చననే బాబు కరప్షన్ ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మహిళలపై దాడులు,  ప్రతి స్కీంలో అవినీతి.  ఇళ్లు, బియ్యంకార్డు, పెన్షన్ ఏవి ఇవ్వాలన్నా కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు.  ఐజీపీ బాలసబ్రమణ్యం ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా ఉంటే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దాడి చేస్తే ఏం చేశారని బాబును నిలదీశారు. ఎంతసేపు వక్రీకరిస్తూ ప్రతిపక్షంపై బురదజల్లడమే బాబు పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికైన శాసనసభ్యులకు గ్రాంట్స్ ఇవ్వకుండా ఓడిపోయిన వాళ్ల పేరుతో జీవోలు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇంతవరకు బాబు ఒక్క రూపాయి కూడ ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్, జపాన్, మలేషియా, ఇస్తాంబులు, ఆస్థానా అంటూ చివరకు రాజధాని మాస్టర్ ప్లాన్  రాజమౌళి దగ్గరకి వచ్చిందని ఎధ్దేవా చేశారు.ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్న బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బుగ్గన హెచ్చరించారు. 
Back to Top