సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉండదు

హైదరాబాద్‌: అసెంబ్లీలో సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉండదని  హైకోర్టు సీనియర్ న్యాయవాధి జంధ్యాల రవిశంకర్ తెలిపారు. ఒక సెషన్ కంటే ఎక్కువ సస్పెండ్ చేయాలంటే మొదట ఫిర్యాదు చేసి, ఆతర్వాత ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు పంపాలని చెప్పారు. టీడీపీ నేత కరణం బలరాం..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంశాలు రెండు వేర్వేరన్నారు. కరణం బలరాం వ్యవహారంలో ప్రివిలేజ్‌ కమిటీ విచారించాకే 6 నెలలపాటు సస్పెండ్‌ చేసినట్టు రవిశంకర్ గుర్తు చేశారు. టీడీపీ నిర్ణయం.. సభ మొత్తం నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ కు సంబంధించి  మహిళల పట్ల టీడీపీ నేతలు సాగిస్తున్న రాక్షస క్రీడను నిలదీస్తున్నందుకు మహిళా శాసనసభ్యురాలు రోజాపై ....పచ్చసర్కార్ కక్ష గట్టి సభ నుంచి సస్పెండ్ చేసింది. రోజా ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయనప్పటికీ...ఆమెను ధీటుగా ఎదుర్కోలేక చంద్రబాబు దొంగచాటుగా కుట్రపూరితంగా సస్పెన్షన్ కు పాల్పడ్డారు.

నిబంధనలను కాలరాస్తూ రూల్స్ ను అతిక్రమిస్తూ కరణం బలరాం కారణం చూపి ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఈనేపథ్యంలోనే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సభలో నిరసన చేపట్టింది. సస్పెన్షన్ పై రోజా తన వివరణ ఇచ్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేయడంపై వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయించనుంది.
Back to Top