రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు...వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి
కాకినాడః.రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని, రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రజలను వంచన చేస్తూనే ఉన్నారన్నారు. మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత భవిష్యత్‌ను సువర్ణమయం చేసుకోవడానికి ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దేశంలో నెంబర్‌వన్‌గా ఎదుగుతున్న ఏపీని అడ్డగోలుగా విభజించారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కుమ్మక్కై అన్యాయంగా రెండుముక్కలు చేశారని మండిపడ్డారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌గా విసిరిపారేశారన్నారు. వైయస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రానికి చెడ్డరోజులు వచ్చాయన్నారు.నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు వంచన చేస్తూనే ఉన్నారని, చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి వంచించారన్నారు. ప్రజలు మరో సారి మోసపోకూడదన్నారు. రాష్ట్రంలో చీకటి తప్ప వెలుగు కనబడటంలేదని విభజన నాటి నుంచి దుర్దినాలు మొదలైయ్యాయన్నారు. రాష్ట్రంపై అప్పుల భారం మోపారని విమర్శించారు. పంచభూతాలను దోచుకుని చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. విభజన దెబ్బ ఒకటి పడితే దానికి రెండింతలుగా ఈ నాలుగేళ్లుగా దెబ్బ తగిలిందన్నారు. వైయస్ జగన్ సీఎం అయి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు..రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్ప వేరే దిక్కులేదని జగన్ పోరాటం మొదలుపెట్టారన్నారు. చంద్రబాబుకు రాజకీయ విలువలు లేవని తూర్పారబట్టారు..హోదా తాకట్టు పెట్టిన చంద్రబాబు..ప్యాకేజీ ముద్ద అని అన్నారని, ప్రత్యేక హోదాపై వైయస్ జగన్ ఆనాటి నుంచే పోరాటం సాగించారని తెలిపారు.