కేంద్రంపై వైయస్ఆర్‌సీపీపి అవిశ్వాసం నోటీసు

ఢిల్లీ, 9 డిసెంబర్ 2013:

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తిరుగులేని, అవిశ్రాంత పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్రం‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పివై రెడ్డి‌ సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు సోమవారం అందజేశారు. ‌అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top