రోడ్ల నిర్మాణంలో చిత్తశుద్ధి లేదు

వెలగపూడి: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు బాపట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎందుకు కేటాయించినట్లో చంద్రబాబు సర్కార్‌ సమాధానం చెప్పాలని బాపట్ల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల కింద దాదాపు రూ. 11 కోట్లు మున్సిపాలిటీకి కేటాయించారని చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన వచ్చిన నిధులు అధికారులు ఎందుకు ఖర్చు పట్టడం లేదని ప్రశ్నించారు. లక్ష మంది ప్రజలున్న ప్రాంతంలో ఒక మీటర్, రెండు మీటర్ల రోడ్లు వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రోడ్లు వేసేటప్పుడు చిత్తశుద్ధి పాటించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం సైడ్‌ కాలువలు కూడా కట్టకుండా రోడ్డు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత మంత్రి రోడ్ల నిర్మాణంపై కలగజేసుకొని రోడ్ల నిర్మాణంలో అధికారులు చిత్తశుద్ధి పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Back to Top