నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా 2019వ నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్‌ను శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్రం కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ల‌ను ఆవిష్క‌రించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019వ సంవ‌త్స‌రం అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని కోరారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, అధికార ప్ర‌తినిధులు వాసిరెడ్డి ప‌ద్మ‌, ప‌ద్మ‌జా త‌దిత‌రులు ఉన్నారు.
Back to Top