నెరవేరని రాజన్న కల రామన్‌పాడు ప్రాజెక్టు

మహబూనగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల శనివారం మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పెద వడ్లమాను గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న రాజ్యం తెస్తారనీ, ప్రజల కష్టాలు తీరుస్తారనీ ఆమె భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ పాలనలో 16 లక్షల మందికి పింఛన్లివ్వగా.. వైయస్ఆర్ ఏకంగా 71 లక్షలమందికి పింఛన్లిచ్చారని చెప్పారు. రామన్‌పాడు ప్రాజెక్టు ద్వారా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  46 గ్రామాలకు నీళ్ళివ్వాలనుకున్నారన్నారు. ఆయన కన్నమూసి మూడేళ్ళయినా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతకు ముందు శ్రీమతి షర్మిలతో గ్రామస్థులు తమ కష్టాలను చెప్పుకున్నారు. తాగునీరు లభించడంలేదనీ, పింఛన్లు అందడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్ళు రావడంలేదనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు.  గతంలో కరెంటు బిల్లు 60 రూపాయలు వస్తే ఇప్పుడు 300 వస్తోందన్నారు. శ్రీమతి షర్మిల వెంట వాసిరెడ్డి పద్మ తదితరులున్నారు.

Back to Top