నెలాఖరులో పాలమూరుకు షర్మిల యాత్ర

మహబూబ్‌నగర్:

నవంబరు నెలాఖరులో వైయస్ షర్మిల పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశిస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్  వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలంపూర్ నుంచి  జిల్లాలో ఆమె యాత్ర  ప్రారంభమవుతుందన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అభివృద్ధి విషయంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Back to Top