నిప్పునంటూ త‌ప్పు చేస్తున్న చంద్ర‌బాబు

క‌ర్నూలుః  ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై. ఐజ‌య్య‌, గౌరు చ‌రితారెడ్డిలు మండిప‌డ్డారు. క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ.. నిప్పున‌ని చెప్పుకుంటూ చంద్ర‌బాబు త‌ప్పుడు ప‌నులు చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ప్ర‌జాస్వామ్యాన్ని పాత‌రేస్తున్న చంద్ర‌బాబు తీరుకు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రో ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు `సేవ్ డెమోక్ర‌సీ` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల కేంద్రాల్లో ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జా సంఘాలు, యువ‌త పెద్ద సంఖ్య‌లో పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత రామ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top