నేడు పాలమూరు క్లాక్‌టవర్‌ వద్ద షర్మిల సభ

మహబూబ్‌నగర్, ‌4 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ‌ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మంగళవారంనాడు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద నిర్వహించే బహిరంగ సభలో అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పాలమూరు జిల్లాలోని ధర్మాపురం నుంచి ప్రారంభం అవుతుంది. అనంతరం బండమీదపల్లి, హనుమాన్‌పూర్, మేనకా థియేటర్ సెంటర్ మీదుగా వ‌న్‌టౌన్ పోలీ‌స్ స్టేష‌న్ చౌరస్తా, అశో‌క్ థియేట‌ర్ నుంచి క్లా‌క్‌టవర్‌కు చేరుకుంటుంది. క్లాక్‌టవర్‌ వద్ద బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడతారు.

‌అనంతరం పాత బస్టాండ్, డీఎస్పీ ఆఫీసు దారి నుంచి తెలంగాణ చౌరస్తా, బస్టాండు, న్యూ టౌ‌న్, ప్రభుత్వ ఆసుపత్రి, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ మీదుగా జేజేఆ‌ర్ గార్డె‌న్సుకు చేరుకుంటుంది. శ్రీమతి షర్మిల రాత్రికి  జేజే గార్డెన్సు వద్ద బస చేస్తారు. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల పాదయాత్ర మొత్తం 13.2 కిలోమీటర్లు కొనసాగుతుందని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
Back to Top