నేడు కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర

కర్నూలు:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ఇప్పటి వరకు వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలలో సాగింది. షర్మిల గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో యాత్ర మొదలు పెట్టి మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని మద్దికెర చేరుకుంటారు. మద్దికెరలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్లు నడుస్తారు.

Back to Top