నామినేటెడ్ సభ్యులకు 'ఓటు' అంగీకరించం

హైదరాబాద్:

సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియను పక్కదోవ పట్టిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం బాజిరెడ్డి వివరాలను తెలిపారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సహకార ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికలలో ఎస్సీ,ఎస్టీలకు ఓటు హక్కు కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. రెండుసార్లు ఎన్నికల ప్రక్రియను ఆపి, ఇప్పుడు హడావుడిగా ప్రకటన చేయడం వెనుక ఉద్దేశాన్ని పార్టీ ప్రశ్నించిందన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తే సహించమని బాజిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top