ముగిసిన 36వ రోజు మరో ప్రజాప్రస్థానం

కలుగొట్ల (పాలమూరు జిల్లా), 22 నవంబర్‌ 2012: షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం 36వ రోజు పాదయాత్ర గురువారం రాత్రికి ముగిసింది. జిల్లాలోని కలుగొట్లకు షర్మిల చేరుకోవడంతో ఈ రోజుకు యాత్ర నిర్ణీత షెడ్యూల్‌ పూర్తయింది. రాత్రికి షర్మిల కలుగొట్లలో బసచేస్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేస్తున్న పాదయాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా కొనసాగి మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ షర్మిల మొత్తం 474.17 కిలోమీటర్లు నడిచారు.
Back to Top