5న జంతర్ మంతర్ వేదికగా వైయస్‌ఆర్ సీపీ ధర్నాప్రకాశం: ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఉధృతం చేశారు. ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. దర్శి నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో వైయస్ జగన్‌ను కలుసుకునేందుకు ఇప్పటికీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాళ్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ యాత్రకు సంబంధించి పార్టీ అధినేత వైయస్ జగన్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దర్శి నియోజకవర్గం తాళ్లూరులో సమావేశమయ్యారు. ధర్నాకు సంబంధించిన అంశాలపై వైయస్ జగన్ చర్చించనున్నారు. కాసేపట్లో ఢిల్లీ యాత్రను వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 5వ తేదీన జంతర్‌మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం అంటూ వైయస్‌ఆర్ సీపీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనుంది.