చేతల్లో చిత్తశుద్ధి చూపండి

() ఏపీ విద్యాసంస్థల మీద ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

() గణాంకాలతో సహా ప్రశ్నలు గుప్పించిన వైయస్సార్సీపీ ఎంపీ

() చిత్త శుద్ధితో విద్యాసంస్థల్ని ప్రోత్సహించాలని సూచన


న్యూఢిల్లీ)) ఏపీలో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాసంస్థల విషయంలో మాటలు చాలా చెబుతున్నారని, చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని వైయస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో అభిప్రాయ పడ్డారు. మానవ వనరుల శాఖ ప్రవేశ పెట్టిన బిల్లు మీద జరిగిన చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. పూర్తి గా గణాంకాలతో సహా విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్న సభికులు అందరినీ ఆలోచనల్లో పడేసింది.

ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులు జాతీయ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ల కోసం పోటీ పడుతున్నారని ఆయన చెప్పారు. కానీ, ఐఐటీ, నిట్ వంటి సంస్థల్లో 28వేల సీట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో పోటీ తీవ్రంగా ఉందని ఆయన విశ్లేషించారు. అటువంటప్పుడు విద్యార్థుల డిమాండ్ కు తగినట్లుగా మరిన్ని కేంద్ర విద్యా  సంస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 13వ సెక్షన్ ను అనుసరించి ఏపీలో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కానీ వీటికి కేటాయిస్తున్న బడ్జెట్ లను చూస్తుంటే ఏమాత్రం సరిపోవటం లేదని వివరించారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలు అంటే భూమి, భవంతులు, ల్యాబరేటరీలు, సిస్టమ్స్ వంటి వసతులన్నీ ఉన్నప్పుడే జాతీయ స్థాయి నాణ్యత గల చదువులు సాధ్యం అవుతాయని పేర్కొన్నారు. కానీ ఐఐటీలకు 40 కోట్లు, సెంట్రల్ వర్శిటీలకు కోటీ కోటిన్నర చొప్పున కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ విద్యాసంస్థలు పూర్తిగా వేళ్లూనుకోవాలంటే దాదాపు 12వందల నుంచి 15వందల కోట్ల రూపాయిల దాకా అవసరం అవుతాయని వివరించారు. అటువంటప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఈ బడ్జెట్ లతో ఆ సంస్థలు పూర్తిగా రూపుదిద్దుకొంటాయని సూటిగా ప్రశ్నించారు. దీంతో పాటు స్థానిక కోటా మీద విజయ సాయిరెడ్డి స్పష్టమైన గణాంకాల్ని సభ ముందు ఉంచారు. ప్రతీ చోటా జాతీయ సంస్థల్లో 15శాతం మాత్రమే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు ఇస్తున్నారని, ఆఖరికి నీట్ ద్వారా వైద్య కళాశాలల అడ్మిషన్లలోనూ దీన్నే కొనసాగిస్తున్నారని చెప్పారు. అటువంటప్పుడు ఏపీ సంస్థలకు 50శాతం దాకా సీట్లు ఇతర రాష్ట్రాలకు వదలాల్సిన అవసరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top