చంద్రబాబుపై ప్రివిలైజ్‌ మోషన్‌

– విడాలివ్వడం పెళ్లి చేసుకోవడం బాబుకు బాగా ఆలవాటు
– సినిమాల్లో మాదిరిగా బాబు డబుల్, త్రిబుల్‌ యాక్షన్‌ చేస్తున్నారు
– తప్పులపై సీబీఐ విచారణ జరుగుతుందని బాబుకు భయం
 

ఢిల్లీ:  ఒక ప్రధాని కార్యాలయంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం, నేరస్తులకు అడ్డగా మారిందని పేర్కొనడం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇది ఒక బ్రీచ్‌ ఆఫ్‌ ప్రివిలేజ్‌ అవుతుందన్నారు. దేశ ప్రధానినే చంద్రబాబు తప్పు పడుతున్నారని, ఆయనపై ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రధానిని కలిస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పత్రికలు, టీవీల్లో అందరూ చూశారు. టెలీ కాన్ఫరేన్స్‌ ద్వారా ౖÐð ఎస్‌ చౌదరి, చంద్రబాబు ఏ విధంగా చర్చించుకున్నారో అందరూ  చూశారన్నారు. చంద్రబాబు మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, అది మరోమారు రుజువైందన్నారు. చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారన్నారు. చంద్రబాబు తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయపడి తిరిగి ఎన్‌డీఏలో చేరేందుకు మంతనాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబే సుజనా చౌదరిని కేంద్రం మంత్రిని కలువమని చెప్పారని, మళ్లీ యనమల రామకృష్ణుడితో ప్రశ్నిస్తారన్నారు. ఇదంతా సినిమాలో డబుల్‌ రోల్‌ హీరో మాదిరిగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందన్నారు. అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరించాలో తెలియదా అని నిలదీశారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు ఎవరికి ప్రయోజనం చేకూర్చలేదని నిజం ఒప్పుకున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్కరికి కూడా ప్రయోజనం చేయలేదన్నారు. ఆయన రాష్ట్రానికి ద్రోహం చేశారని, అది తనకు తానుగా చెప్పుకున్నారన్నారు. తనకు, తన కుటుంబానికి, తన సామాజిక వర్గానికే మేలు చేశారని ఆయనే ఒప్పుకున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి చంద్రబాబు యూటర్న్‌ అంకుల్‌ అని ప్రూవ్‌ చేసుకుంటున్నారన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, విడాకులు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. పది రోజులకే విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లికి అంగీకరిస్తారని ఊహించలేదన్నారు. దేశ ప్రధానినే తప్పు పడుతున్నారన్నారు. ఒక పార్లమెంట్‌ సభ్యుడిగా పీఎంను కలిసే హక్కు నాకుందన్నారు. చంద్రబాబు అవినీతిని, ప్రజల సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్లే హక్కు నాకుందన్నారు. ఎవరు సభను అడ్డుకుంటున్నారో చంద్రబాబును అడగాలని సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ సభ జరగాలని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు ఈ రోజు కూడా లోక్‌సభలో, రాజ్యసభలో సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తానే స్వయంగా రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కోరానని చెప్పారు. 

 
Back to Top