ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు

ఏపీ అసెంబ్లీ: వరుస మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు రూ.3340 కోట్లు ఉన్నాయని, వీటిని ఎప్పుడు చెల్లిస్తారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఇన్‌పుట్‌ సబ్సిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ..ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని నిరాహారదీక్ష కూడా చేశామన్నారు.. స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ను అన్నింటికి ఆధారంగా తీసుకుంటున్నారు. పరిహారం చెల్లింపులో కూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పాటించాలని కోరారు. ఇన్సూరెన్స్‌ వేరే, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వేరని చెప్పారు. సీఎం మా జిల్లాకు వచ్చి ఏదో ఒకటి ఇస్తామని చెబుతున్నారు. రైతుల పట్ల మానవతాదృక్ఫధంతో వ్యవహరించాలి.

Back to Top