చిత్తూరు: వైయస్‌ఆర్‌సీపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పి లుపునిచ్చారు. పెనుమూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..కుప్పం కంటే జీడీ నెల్లూరులో అత్యధిక మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ గెలువబోతుందన్నారు. వైయస్ జగన్‌కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలన్నారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో జిల్లాకు ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథంపట్టారని, రాబోయేది మనందరి ప్రభుత్వమే అన్నారు.