పలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మైదుకూరు టౌన్‌ : మండలంలోని పలు శుభ కార్యాలయాల్లో శుక్రవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. వైయస్సార్‌సీపీ మండల కన్వినర్‌ గల్లవాన్లపల్లె నరసింహారెడ్డి స్వగృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరా కళ్యాణ మండపంలో ముస్లింసోదరుల వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ నాయకులు అన్నలూరు శ్రీనివాసుల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, రాంమ్‌సాయిరెడ్డి, ఖాజీపేట శ్రీనివాసుల్‌రెడ్డి, ఎన్‌.యర్రపల్లె యాదవ్, మదీనాదస్తగిరి, యాకోబ్‌ హుస్సేన్‌ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top