జగనన్నా..జీడీ నెల్లూరును దత్తత తీసుకోండిచిత్తూరు: నాడు సత్యవేడు నియోజకవర్గాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దత్తత తీసుకున్నారని, ఇప్పుడు జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే నారాయణస్వామి కోరారు. పెనుమూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ హయాంలో 36 చెరువులను అనుసంధానం చేశారని, చంద్రబాబు వచ్చాక ఈ చెరువులకు నీరిచ్చిన సందర్భాలు లేవన్నారు. ఎదురుకుప్పంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. దళితులకు బూములు పంపిణీ చేయాలని కోరారు. కృష్ణాపురం ప్రాజెక్టుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టి కార్పోరేషన్లకు నిధులు కేటాయించాలన్నారు. చంద్రబాబు మూర్ఖుడని, ఈ జిల్లాను ఏ నాడు ఆదుకోలేదన్నారు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటానని చెప్పారు. నీకు తోడుగా నీడగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు ఉన్నారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాకు దైవ స్వరూపుడని కొనియాడారు.
 

తాజా ఫోటోలు

Back to Top