బాబుకు ఎమ్మెల్యేలను కొనడంపైనే శ్రద్ధ

ఢిల్లీ: రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటుంటే.. చంద్రబాబు మొదలు టీడీపీ నేతలంతా కమీషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించి యువతను చైతన్య పరిచారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొనడంలో ఉన్నంత శ్రద్ధ.. ప్రత్యేక హోదా సాధించడంలో లేదన్నారు. చదువుకున్న యువత ఉద్యోగాలు చేసేందుకు బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదే హోదా వస్తే పరిశ్రమలు వచ్చి స్థానికంగా ఉండే యువతకే ఉద్యోగాలు దొరకుతాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా ఇంకా సంవత్సరం ఓపిక పడితే వైయస్‌ జగన్‌ సీఎం అవుతారని, ప్రజల కష్టాలన్నీ తారుతాయన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ చూడాలంటే వైయస్‌ జగన్‌ను సీఎంను చేసుకోవాలన్నారు. 
 
Back to Top