మంత్రులు నారాయణ, గంటాలను భర్తరఫ్‌ చేయాలి

ఏపీ అసెంబ్లీ:  పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసులును మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం సభ వాయిదా అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కష్టపడి చదివించారని, ఇలాంటి సమయంలో పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాల్సిన ప్రభుత్వం అక్రమాలకు తెర లేపిందని మండిపడ్డారు. మంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరులో,  ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసు ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలో పేపర్‌ లీక్‌ అయ్యిందన్నారు. అనంతపురంలో జిల్లాల్లో పేపర్‌ లీక్‌ చేస్తే చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. తక్షణమే మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసులను భర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీక్‌ కావడం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంకు నీతి, నిజాయితీ ఉంటే వారిని కేబినెట్‌ నుంచి తొలగించాలని సవాల్‌ విసిరారు. పేపర్‌ లీక్‌పై చర ్చకు పట్టుబడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థులు సమస్యలపై చర్చకు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని కొరముట్ల ప్రశ్నించారు.

Back to Top