టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది..

శ్రీకాకుళంః టీడీపీ ప్రభుత్వం తమ నియోజకవర్గంలో వివక్ష చూపుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. నియోజకవర్గంలో తాగునీరు,సాగునీరు సమస్య అధికంగా ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునికీకరణ పూర్తికాలేదన్నారు.రాజాం పట్టణంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పేదలను జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు.టీడీపీ హయాంలో అభివృద్ధి అంతా శూన్యమన్నారు. టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారని  విమర్శించారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు.పాదయాత్ర బ్రహ్మరథం పడుతున్నారని, ఖచ్చితంగా వైయస్‌ జగన్‌ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top