<strong>బీజేపీతో చీకటి ఒప్పందాలు.. కాంగ్రెస్‌తో జతకట్టేందుకు యోచన</strong><strong>వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఐజయ్య</strong>కర్నూలు: బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. కర్నూలు జిల్లా నందికోడ్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జలయజ్ఞం ప్రవేశపెట్టి సాగు, తాగునీరు అందించిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనత వైయస్‌ఆర్‌దని, ఆ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు అవినీతి సొమ్ముతో గెలవాలని కుట్రలు చేస్తున్నాడని, ఓటుకు రూ. 5 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు అవినీతిపై విచారణ ఎదుర్కోక తప్పదన్నారు.