విద్వేషాలు పెంచేందుకే న్యాయవాదులపై దాడి

హైదరాబాద్ :

ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకే సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరిగిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంలోకి చొరబడి తెలంగాణ న్యాయవాదులు దాడు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడుల కారణంగా సమస్యలు మరింతగా పెరుగుతాయే కాని పరిష్కారం కావని పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులపై దాడిని ఖండించిన ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయాన్ని..రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదులే ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచుతాయని విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top