బాబుది 'ఆత్మవంచన' యాత్ర: భూమన

తిరుపతి, 21 ఆగస్టు 2013:

తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ప్రజలను వంచించేందుకు సిద్ధమవుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌కి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి  నిప్పులు చెరిగారు. ఆయన చేసేది ఆత్మగౌరవ యాత్రకాదని.. 'ఆత్మవంచన యాత్ర' అని భూమన అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో బుధవారంనాడు కరుణాకరరెడ్డి తిరుపతిలో మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి మూలకారకుడు చంద్రబాబే అని భూమన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రంలోని ‌యుపిఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.

Back to Top