<strong>గుంటూరు:</strong> పోతర్లంక అవినీతి ఎక్కడ బయటపడిపోతుందోనని చంద్రబాబు తనను హౌస్ అరెస్టు చేయించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మేరుగు నాగార్జునన గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు ప్రారంభించబోయే పోతర్లంక ఎత్తిపోతల పథకాన్ని మేరుగు నాగార్జున పరిశీలించి లీకులు, అవకతవకలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చంద్రబాబు పోలీసుల చేత గృహ నిర్బంధం చేయించారు.