ముసుగు తొలగించరా

బనగానపల్లె రూరల్‌ః రాష్ట్రంలో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన కూడా అధికారులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్సార్‌ విగ్రహానికి వేసిన ముసుగును తొలగించకపోవడంతో వైయస్సార్‌ అభిమానులు, ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మండలం లోని యనకండ్ల గ్రామంలో బస్టాండ్‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన, డాక్టర్‌ వైయస్సార్‌ విగ్రహానికి గత నెలలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో రెవెన్యూ అధికారులు విగ్రహానికి ముసుగువేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ముగిసి సుమారు 16 రోజులు పూర్తయింది. అయితే వైయస్సార్‌ విగ్రహానికి వేసిన ముసుగు రెవెన్యూ అధికారులు తొలగించక పోవడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ గ్రామం ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతోనే వైయస్సార్‌ విగ్రహానికి వేసిన ముసుగును తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

Back to Top