తూర్పుగోదావరిః స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా రాజమండ్రి లోక్‌సభ సీటును వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీలకు కేటాయించడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న భరత్‌కు వైయస్‌ఆర్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ఎయిర్ పోర్టు నుంచి రాజమండ్రి నగరం వరుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఐటిదాడులు జరిగితే దానిని రాష్ట్రం మీద జరిగిన దాడులుగా చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. నిజాయతీగా ఉంటే ఐటిదాడులపై చంద్రబాబు భయపడనవసరం లేదన్నారు. తప్పులు జరిగిన చోట్ల దాడులు జరుగుతాయన్నారు.