బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా మావోల బంద్

టీడీపీ సర్కార్  బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోల బంద్ కొనసాగుతోంది. బాక్సైట్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మావోలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లోని దుకాణాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం వెంటనే బాక్సైట్ జీవోను ఉపసంహరించచుకోవాలని మావోలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top