మనసులేని ప్రభుత్వాలు - విజయమ్మ ఆగ్రహం

  • వైఎస్ హయాంలోనే వికలాంగులకు లబ్ధి
  • వారికి కష్టసుఖాల్లో అండగా ఉంటామని హామీ 

హైదరాబాద్, 2012 ఆగస్టు 25: రాష్ట్రంలో వికలాంగులకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే లబ్ధి చేకూరిందని.. కాని జాలి, కరుణ ఏమాత్రం లేని ఇప్పటి ప్రభుత్వం లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లను రద్దు చేసిందని వైయస్సార్ కాంగ్రెస్­ గౌరవాధ్యక్షురాలు వై.యస్. విజయమ్మ విమర్శించారు. దాదాపు 8.55 లక్షల మందికి నెల నెలా రూ. 500 పెన్షన్ వచ్చేటట్లు చేసిన ఘనత కూడా వైయస్­కే చెల్లుతుందని చెప్పారు. కాని, టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వికలాంగులకు పెన్షన్‌గా కేవలం రూ. 75 మాత్రమే ఇచ్చేవారని.. అది కూడా మూడు నెలలకొకసారి ఇచ్చేవారని అన్నారు. పైగా అప్పుడు లక్ష మందికి మాత్రమే ఈపెన్షన్లు ఉండేవని గుర్తుచేశారు. 

' వికలాంగుల రాజ్యాధికార సభ' కు ముఖ్య అతిథిగావిజయమ్మహ్వానం 

 వికలాంగుల హక్కుల పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు శుక్రవారం హైదరాబాద్‌లో విజయమ్మను కలిశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 న హైదరాబాద్‌లో నిర్వహించే ‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు ముఖ్య అతిథిగా రావాలని ఆమెను వారు కోరారు. వికలాంగుల కష్టసుఖాలలో వైయస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. 

లక్షపెన్షన్లనురద్దుచేసినప్రస్తుతప్రభుత్వం... 

ఈ సందర్భంగా విజయమ్మ ప్రస్తుత ప్రభుత్వ అమానుష చర్యలను ఎండగట్టారు. దివంగత నేత వైయస్ ప్రతి విషయాన్నీ మానవతా వాదిగా చూసేవారని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకే ఆఖరు నిమిషం దాకా పరితపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల విషయంలో రాజశేఖరరెడ్డి హయాంలోనే అత్యంత లబ్ధిచేకూరిందన్నారు.

చంద్రబాబు హయాంలో వికలాంగుల సంక్షేమం కోసం కేవలం రూ. 9 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ రూ. 496 కోట్లు ఖర్చు చేశారని విజయమ్మ చెప్పారు. వికలాంగుల వివాహాల కోసం అంతకు ముందున్న ప్రభుత్వాలు కేవలం రూ. 3,000 అందజేస్తే దాన్ని వైయస్ రూ. 10,000 కు పెంచారని తెలిపారు. చెవిటి, మూగ వారు ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ. 7 లక్షల దాకా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు. 

జగన్­ కూడావైయస్­ బాటలోనేనడుస్తారు...

వైయస్ మరణించాక ప్రస్తుతం మనసులేని ప్రభుత్వం దాదాపు లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లను రద్దు చేసిందని విజయమ్మ విమర్శించారు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా వై.యస్.జగన్మోమోహన్‌రెడ్డి కూడా ఆయన బాటలో నడుస్తారని వికలాంగులకు ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ మొదటి ప్లీనరీలో వికలాంగులకు నెల నెలా రూ. 1,000 పెన్షన్ అందజేయనున్నట్లు జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే కాకుండా అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత పెంచే అవకాశం ఉంటుందన్నారు. 

వికలాంగుల కష్టసుఖాలలో పార్టీ అండగాఉంటుంది.. 

వికలాంగుల కష్టసుఖాలలో వైయస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

వైయస్­ హామీలనుప్రభుత్వాలువిస్మరించాయిఃమందకృష్ణ 

స్వాతంత్య్రం లభించిన తర్వాత చట్టసభల్లో వికలాంగుల తరఫున ఏనాడూ బలమైన చర్చలు జరగలేదని అంతకుముందు మాట్లాడిన మంద కృష్ణ విమర్శించారు. . వైయస్ సీఎంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. అందుకే సీఎం కిరణ్‌తో అమీతుమీ తేల్చుకోవటానికి ఈ నెల 28న సిద్ధమవుతున్నట్లు కృష్ణమాదిగ చెప్పారు. అదేవిధంగా వైయస్ ఆశయంతో ఏర్పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అండగా ఉండాలని విజయమ్మను కోరారు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, వారి సమస్యలపై విజయమ్మకు విజ్ఞాపన పత్రం అందజేశారు.

Back to Top