మండపేటలో నేడు షర్మిల బహిరంగ సభ

రాజమండ్రి, 9 జూన్‌ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం 174వ రోజు చేసే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు. అనపర్తి మండలం పొలమూరుపాకల నుంచి ఆదివారం ఉదయం‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రామవరం క్రాస్‌రోడ్ వరకూ 6.5 కిలోమీటర్ల నడిచిన తరువాత మధ్యాహ్న భోజనానికి ఆగుతారు.

భోజన విరామం అనంతరం ఆమె అర్తమూరు, తాపేశ్వరం క్రాస్‌రోడ్‌, మండపేట మెయిన్‌రోడ్‌, బస్టాండ్‌ సెంటర్‌, కలువపువ్వు సెంటర్‌ వరకూ పాదయాత్ర చేసి అక్కడ జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం  పొట్టి శ్రీరాములు రోడ్, రథం సెంట‌ర్, కె.పి.రో‌డ్‌ వరకూ మరో 7.5 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మండపేట కె.పి. రోడ్డు సమీపంలో రాత్రికి బస చేస్తారు. ఆదివారం మొత్తం 14 కిలోమేటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు.

Back to Top