<strong>విజయనగరం, 8 డిసెంబర్ 2012:</strong> ఎఫ్‌డిఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు టిడిపికి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరవడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుజయ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఈ బిల్లుపై టిడిపి అనుసరించిన నీతిమాలిన చర్యపై వారంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఎఫ్‌డిఐలను వ్యతిరేకించాలనుకుంటే చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీల చేత ఆ విధంగా ఓటు వేయించాలని, ఢిల్లీలోనే ఉండి ఓటింగ్ సమయంలో గైర్హాజరవడమేమిటని రంగారావు ప్రశ్నించారు. శనివారంనాడు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. టిడిపి ఎంపీల ద్వంద్వ వైఖరి తేటతెల్లం అయిందని విమర్శించారు.