మహానేత వైయస్‌ఆర్‌కు షర్మిల ఘన నివాళి

గడ్డమణుగు (కృష్ణాజిల్లా), 16 ఏప్రిల్‌ 2013: ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా, పాలక ప్రతిపక్షాల కుమ్మక్కులను, కుట్రలను వెల్లడిస్తూ శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 122వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా గడ్డమణుగు శివారు నుంచి శ్రీమతి షర్మిల మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అశేష జనవాహిని నడుమ‌ ఆమె మంగళవారం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల నేడు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.
Back to Top