మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేద్దాం

విశాఖ‌ప‌ట్నంః విశాఖ భూదందాల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని భీమిలి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ క‌న్విన‌ర్ అక్ర‌మ‌ణి విజ‌య‌నిర్మ‌ల సూచించారు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్యాల‌యంలో విజ‌య‌నిర్మ‌ల ఆధ్వ‌ర్యంలో పార్టీ నేత‌ల స‌మావేశం నిర్వ‌హించారు. రూ. కోట్లు విలువ చేసే భూముల‌ను టీడీపీ నేత‌లు దోచుకుంటున్నార‌ని, చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో ప్ర‌భుత్వ భూముల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌భుత్వ భూదందాల‌కు నిర‌స‌న‌గా ఈ నెల 22న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన మ‌హాధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని ఆమె కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

Back to Top