మహిళలంతా ఏకమై ప్రభుత్వంపై పోరాడుదాం..!

ఏపీలో మహిళా వ్యతిరేక పాలన నడుస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. రాష్ట్రంలోని మహిళలంతా ఏకమై రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై పోరాడాలని పార్టీ కార్యాలయంలో ఆమె పిలుపునిచ్చారు. హిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోజా మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపాల్ బాబు రావు మీద విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా విచారణ జరపాలన్న రోజా...వియ్యంకుడైనందునే మంత్రి నారాయణకు భయపడి గంటా శ్రీనివాసరావు  కళాశాలలపై చర్యలకు వెనకాడుతున్నారని ఆరోపించారు.
Back to Top