ఇదీ మా అల్లుడు 'బాబు' వెన్నుపోటు చరిత్ర

గుంటూరు: కేజీ బేసిన్లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు. దీంట్లో 30 వేల కోట్లు మోదీకి పంపాలి, 4 వేల కోట్లు ఉంచుకుంటానన్నాడు. కానీ చివరికి 4 వేలకోట్లు గుజరాత్కి పంపి, 30 వేలకోట్లు తను ఉంచుకున్నాడని చెప్పారు. అల్లుడు చరిత్ర అత్తకే కదా తెలిసేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజున చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ దగ్గర 10లక్షల రూపాయలు తీసుకొని అల్లుడయ్యాడు.  వెధవా నువ్వు చేస్తున్నది పనికిమాలిన పని అని టీచర్లు గానీ, తల్లి గానీ ఎవరో ఒక్కరైనా చెప్పి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు అని చంద్రబాబు నాయుడుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇతరుల నెత్తిమీద చెయ్యిపెట్టి పైకి వచ్చినవాడు చంద్రబాబు. బాబు చరిత్రంతా మోసాల మయం. తెల్లవారి లేవడంతోనే అబద్దంతో టీ తాగుతాడు. అబద్దంతో టిఫిన్ చేస్తాడు. అబద్దంతో లంచ్ చేస్తాడు. అబద్దంతోనే డిన్నర్ చేస్తాడు. ఎన్టీఆర్ తన జీవితంలో ఒక్క అబద్దం చెప్పి ఎరగరు. చంద్రబాబు తన జీవితంలో ఒక్క నిజం చెప్పి ఎరగడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేశాడు. వైఎస్ మరణం వెనక కుట్రలోనూ చంద్రబాబు హస్తముందన్న అనుమానాలున్నాయి. చిదంబరంతో కుట్రపన్ని కాంగ్రెస్తో జతకట్టి జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి జైలులో పెట్టించిన నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడిది. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో కొట్టుకుపోయినట్లు అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు ఇపుడు ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ముడుపులిచ్చిన రేవంత్ వ్యవహారంలో నేడో రేపో చంద్రబాబు పాత్ర బైటపడబోతోంది. ఎసీబీ వాళ్లు కేసుపెట్టబోతున్నారు. అపుడు చెబుతాం చంద్రబాబు సంగతి.
Back to Top