ప‌రిశ్ర‌మ‌ల పేరుతో భూములు లాక్కుంటున్నారు

వైయ‌స్‌ జగన్ కు పెనుకొండ రైతుల ఫిర్యాదు
అనంతపురం : పరిశ్రమల పేరుతో భూములు లాక్కుంటున్నారని పెనుకొండ రైతులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గురువారం పులివెందుల‌ వెళ్తున్న వైయ‌స్‌ జగన్‌ను కోడూరుతోపు వద్ద పెద్ద సంఖ్యలో రైతులు కలిశారు. ప్రభుత్వం బలవంతంగా త‌మ భూములు సేకరిస్తోందని రైతులు వైయ‌స్ జగన్‌ వద్ద వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆయనను కోరారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ భూ సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అంద‌రం ఒక్క‌టై పోరాటం చేద్దామ‌ని, ప్ర‌భుత్వంపై తాను ఒత్తిడి తెస్తాన‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు.
Back to Top