() చంద్రబాబుది భూ దాహమే() ప్రతీ చోటా భూములు లాక్కొంటున్నారు() వద్దంటున్నా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని రుద్దుతున్నారు() చంద్రబాబు ప్రభుత్వానికి బంగాళాఖాతమే గతిబేతపూడి, పశ్చిమగోదావరి)) ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని కట్టడం తగదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరించారు. గ్రామాల మధ్య నుంచి ఫ్యాక్టరీని తరలించాలని, పది కిలోమీ టర్ల దూరంలో ఉన్న సముద్రతీరంలో కట్టుకోవాలని సూచించారు. అలా కాకుండా మొండికేస్తే ప్రభుత్వమే బంగాళాఖాతంలో పడుతుందని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసరాల్లోని ఆక్వా మెగా ఫుడ్ ప్రాజెక్టు పరిసరాల్లోని గ్రామాల్లో వైయస్ జగన్ పర్యటించారు. బేతపూడి గ్రామంలో బాధితుల్ని ఉద్దేశించి ముఖాముఖి మాట్లాడారు. ఇక్కడి ప్రజలు వద్దంటున్నా బలవంతంగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నెలకొల్పడం సమంజసం కాదని వైయస్ జగన్ అన్నారు. పది కిలోమీటర్ల దూరం తరలిస్తే అక్కడ పెద్దగా మనుష్య సంచారం ఉండదని, సముద్ర తీరం దగ్గర కట్టుకోవటం మేలు అని అన్నారు. సముద్ర తీరంలో ఇదే యాజమాన్యానికి భూమి ఉందని, అక్కడ ప్రాజెక్టు పెట్టుకొంటే పైప్ లైన్ ఖర్చు కూడా ఉండదని చెప్పారు. యాజమాన్యానికి కూడా మంచి జరుగుతుందని హితవు పలికారు. ఫ్యాక్టరీ అనుకూల వర్గాలకు సూచనఈ ప్రాంతంలో పర్యటించేటప్పుడు కొంతమందిని కలవటం జరిగిందని వైయస్ జగన్ చెప్పారు. ఫ్యాక్టరీ కావాలని కోరుకొంటున్న వారిని కదిలిస్తే ఉద్యోగాల గురించి చెప్పారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ పెడితే ఉద్యోగాలు వస్తాయన్న ఆశ వాళ్లలో కనిపించిందని చెప్పారు. అయితే పది కిలోమీటర్ల అవతలకు తరలించినా కూడా ఉద్యోగాలు వస్తాయని ఆయన గుర్తు చేశారు. కానీ ఇక్కడే పెడితే మాత్రం పొలాలు బతకవని, అప్పుడు రైతులు నాశనం అవుతారని, కూలీలు చెల్లాచెదురు అవుతారని.. అంతిమంగా అన్ని వర్గాల ప్రజలకు నష్టం అని వివరించారు. అందరికీ మంచి అయ్యే మార్గంఈ ఫ్యాక్టరీ ని 10 కిలోమీటర్ల దూరంలోకి తరలిస్తే అందరికీ మంచిదని వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. “ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే 50 ఏళ్లకు కూడా ప్రజలు సంతోషపడేలా నమ్మకంతో చేయాలి. ఎంత పెట్టుబడి పెట్టారని చూస్తే 15,20 కోట్లు అని చెబుతున్నారు. నష్టమేమి లేదు. ఫౌండేషన్ వర్క్ మాత్రమే నష్టపోతారు. దూరం ఆలోచన చేసి అందరి మన్ననలు పొందే పరిస్థితి రావాలి.” అని వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏమీ చేసినా ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పారు. . 144 సెక్షన్ పెట్టి పోలీసులతో యుద్దవాతావరణ తలపించడం సరి కాదని హెచ్చరించారు. ఆక్వా చెరువులకు అని చెప్పి భూములు కొని, ఇప్పుడు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం తగదని వైయస్ జగన్ చెప్పారు. ఇప్పటికైనా తరలించటం మేలు అని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి ఫ్యాషన్ అయిందే..!ప్రజలు ఒప్పుకోకపోయినా బలవంతంగా భూములులాక్కోవటం చంద్రబాబుకి ఫ్యాషన్ గా మారిందని వైయస్ జగన్ విశ్లేషించారు. “ మచిలీపట్నంలోపోర్టు పేరు మీద వేల ఎకరాలు లాగేస్తున్నావ్, అమరావతిలో రైతుల పొలాలకు నిప్పులు పెట్టి మరీ బలవంతంగా బూములు తీసుకుంటున్నావ్. భోగాపురం ఎయిర్ పోర్ట్ అని ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నా బలవంతంగా జులుం చూపుతున్నావ్.” అని వైయస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుని ఎదిరిస్తే చాలు అభివృద్ధి నిరోధకులమని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “అభివృద్ధి నిరోధకుడివి నీవా, మేమా..! అభివృద్ధిని కాంక్షించేది మేమే” అంటూ సూటిగా వైయస్ జగన్ స్పందించారు. ఆలోచనతో చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి ఉండదని జగన్ వివరించారు. బాబు పరిపాలన రెండేళ్లని గుర్తుపెట్టుకోవాలని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేస్తే రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ని చూసుకొని ప్రజావ్యతిరేకంగా చేస్తే బాబు ప్రభుత్వం, ప్రాజెక్ట్ బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుందని వైయస్ జగన్ జోస్యం పలికారు. ప్రజల పోరాటానికి అండదండలు..! ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించినందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ని జైలు లో పెట్టారని, అప్పుడు తమ పార్టీ నేత గ్రంథి శ్రీనివాస్ వెళ్లి పోరాటం చేసి విడిపించారని గుర్తు చేశారు. తర్వాత కాలంలో కూడా అనేక దఫాలుగా తమ పార్టీ నాయకులు ప్రజల తరపున పోరాడారని వైయస్ జగన్ వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు కేసులు, సెక్షన్లు, పోలీసులు ఉపయోగిస్తే ప్రభుత్వం ఎల్లకాలం సాగదని ఆయన హెచ్చరించారు. ప్రజలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.