కోటప్పకొండకు వైయస్ఆర్ సీపీ నేతలు

నరసరావుపేట: రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి పూర్తి విశ్వాసం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. త్వరలో జగన్‌కు బెయిల్ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ఆదివారం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వారు త్రికోటేశ్వరుడికి పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 26 జీవోలపై ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనడం చూస్తుంటే జగన్ తప్పూ చేయలేదనేది వెల్లడవుతోందన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర నాయుడు, జిల్లా బీసీ మహిళా కన్వీనర్ దేవళ్ళ రేవతి, పిడుగురాళ్ళ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తదితరుల ప్రసంగించారు.

పాదయాత్రకు భారీ స్పందన.. తొలుత పట్టణంలోని రామిరెడ్డిపేట కాకుమానువారి వీధిలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర నాయుడు, నియోజకవర్గ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నన్నపునేని సుధ, లతీఫ్‌రెడ్డిలు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్గంలో గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సత్తెనపల్లి నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి కలిసి పాదయాత్రలో కొంతదూరం పాల్గొన్నారు. డాక్టర్ ఎ.రామలింగారెడ్డి, డాక్టర్ పమ్మిసరస్వతీ రామలింగారెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డిలు పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు కపలవాయి విజయకుమార్, డాక్టర్ గోపిరెడ్డికి పూలమాలలు వేసి పాదయాత్రకు మద్దతు తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోటప్పకొండ దిగువ నుంచి పాదయాత్రలో పాల్గొన్నారు.

అక్కడి నుంచి త్రికోటేశ్వరుడి సన్నిధికి చేరుకుని జగన్ వెంటనే జైలు నుంచి బయటకు రావాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో వెంకటరామిరెడ్డి దగ్గర ఉండి నాయకులకు స్వామివారి దర్శనం చేయించారు. పాదయాత్రలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం కన్వీనర్ సాయిబాబు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నాబత్తుని సదాశివరావు, విజయవాడ పట్టణ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బీసీ సెల్ మహిళా కన్వీనర్ దేవళ్ళ రేవతి, బొల్లా బ్రహ్మనాయుడు, నకరికల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భవనం రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top