కోటగిరి శ్రీధర్‌కు కొఠారు అభినంద‌న‌లు

ప‌శ్చిమ గోదావ‌రి: ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా కోట‌గిరి శ్రీధర్‌ను నియ‌మించ‌డం ప‌ట్ల పార్టీ దెందులూరు నియోజకవర్గ  స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ కొఠారు రామచంద్రరావు అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఏలూరులో శ్రీధర్‌ క్యాంపు కార్యాలయంలో రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి యువనేత కోటగిరి శ్రీధర్‌కు  బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. అందరం కలసి పార్టీ బలోపేతం, అభివృద్దికి కృషి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Back to Top