కిరణ్ కుమార్‌పై గోనె మండిపాటు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోనె ప్రకాశరావు మండిపడ్డారు. జాక్‌పాట్‌తో సీఎం అయిన కిరణ్‌కుమార్ రెడ్డి మహానేత షర్మిల చేపట్టనున్న పాదయాత్రపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజల సమస్యలు పట్టని ఆయనకు ఎవరైనా ఇలాంటి అంశాలపై యాత్ర చేస్తే భీతి కలగడం సహజమేనన్నారు. చంద్రబాబు యాత్ర ప్రకటన వెలువడినపుడు నోరు మెదపని ఆయనకు షర్మిల యాత్ర  చేస్తారని తెలియగానే చెమటలు పడుతున్నాయన్నారు.

Back to Top