బొబ్బిలిలో రాజరికం నడుస్తోంది...


ఓటమి భయంతో బహిరంగ సభకు ఆటంకాలు..
వైయస్‌ జగన్‌ సభకు వెళ్లొద్దంటూ ప్రజలకు బెదిరింపులు..
బొబ్బిలి రాజులపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం

విజయనగరంః  బొబ్బిలిలో ఇంకా రాజరిక వ్యవస్థే నడుస్తుందని..ప్రజాస్వామ్య వ్యవస్థ లేదని బొబ్బిలి నియోజకవర్గ వైయస్‌ర్‌సీపీ నేతలు విమర్శించారు. జననేత వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బొబ్బిలి రాజుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఓటమి భయంతో అనేక ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. అక్కసుతో వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను ధ్వంసం చేయించిన బొబ్బిలి రాజులు  నేడు జరగబోయే భారీ బహిరంగ సభకు కూడా ఆటంకాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. .టీడీపీ కార్యకర్తలు గ్రామాలను పంపించి బహిరంగ సభకు వెళ్లొద్దని ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో కనీస విద్యాసౌకర్యాలు కూడా అందుబాటులో లేవన్నారు. గవర్నమెంట్‌ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి నినాదంతో టీడీపీలోకి ఫిరాయించిన సుజయ్‌ కృష్ణ రంగారావు  అభివృద్ధి ఏం చేసారో చెప్పాలన్నారు. వెంకటరాయ సాగర్‌ ప్రాజెక్టు మట్టితో నిండిపోయిందని,సాగునీరు పారడం లేదన్నారు.ఛానల్‌ కనెక్ట్‌విక్టి కూడా దెబ్బతిందన్నారు. 99 శాతం పరిశ్రమలు అన్ని మూతపడ్డాయన్నారు.ప్రభుత్వం అండలేకపోవడంతో బొబ్బిలి పట్టణంలోనే సుమారు 10 వేల నిరుద్యోగులయ్యారన్నారు.వైయస్‌ఆర్‌సీపీకి వెన్నుపోటు పోడిచిన బొబ్బిలిరాజులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

తాజా వీడియోలు

Back to Top