ప్రజాస్వామ్య విలువలు ఖూనీ

ఆలూరు రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆరోపించారు. బుధవారం ఆయన స్వగ్రామమైన గుమ్మనూరులో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచిన వారు మరోపార్టీలో చేరేముందు వారి పదవులకు రాజీనామా చేయించాలన్నారు. అలా చేయకుడా చంద్రబాబు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేఖంగా వైయ‌స్ఆర్ సీపీ కేంద్రకమిటీ పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల పార్టీ కన్విన‌ర్లు, ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.

Back to Top