కరెంట్ సత్యాగ్రహానికి అశేష జన సంఘీభావం

హైదరాబా‌ద్, 4 ఏప్రిల్ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 'కరెంట్‌ సత్యాగ్రహా'నికి ప్రజల నుంచి అశేష స్పందన, మద్దతు వస్తోంది. పెంచిన కరెంట్ ఛార్జీలను‌ తక్షణమే తగ్గించాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు ఆవరణలో కొనసాగుతున్న 'కరెంట్ సత్యాగ్రహ‌ం' దీక్షా ప్రాంగణానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. శ్రీమతి విజయమ్మకు, దీక్షలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారంతా సంఘీభావం తెలుపుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న అభిమానులతో దీక్షా వేదిక వద్ద సందడి నెలకొన్నది. దీక్షావేదిక వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీమతి విజయమ్మను పలకరించి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
Back to Top